దేశమును ప్రేమిస్తున్నా!


అమోర్ డి పేట్రియా
*
ఎక్క వలసిన విమానం ఎక్కడ తప్పిపోతోందోనని … పెట్టేబేడాను బరబరా లాక్కుంటూ..
హడావుడిగా జె.ఎఫ్.కె. టెర్మినల్ 4 నుంచి 1 దాక ఉరుకులుపరుగుల నడకతో వెళుతున్నానా…
టక్కున స్థంభించిపోయినట్లు నిలబడిపోయాను .సరిగ్గా ఈ శిల్పం ఎదురుపడగానే!
నిజం.శిల్పి వినయంగా అన్నట్లుగా..పెదవిదాటలేని మాటలెన్నింటినో మాట్లాడగల శక్తిఉన్న ఆ చేతులు సమిష్ష్టిగా మాట్లాడాయి.మరోసారి.
భావోద్వేగాలన్నీ ఆ చేతి వేళ్ళ కొనల్లోంచి జాలువారుతున్నాయి.
ఆ ముంజేతుల ముడతల్లో పకరిస్తున్నాయి. ఆ అరచేతులపై పొంగిననరాల్లో ఆలోచనలెన్నో చిక్కుముళ్ళు పడ్డాయి.
అవన్నీ ఒక్కసారిగా ముప్పిరిగొని నా ముందరికాళ్ళకు బంధాలయ్యాయి.అచ్చంగా నాతోనే మాట్లాడుతున్నట్టుగా.
సత్యం సాత్కాక్షరించినట్లయ్యింది.
మనిషికి మనిషి తోడు!
అంతే!
అంతకు మించి ఏంకావాలి?
నిజం.
కష్టసమయాల్లో మనం మనంగా నిలబడగలిగే ఆ సందర్భం కాలం మనముందు నిలుపుతుంది.నిర్దాక్షిణ్యంగా. మానవస్పందనలకు మించిన సౌందర్యం ఏముంది?
ఇనుములో సౌకుమార్య మర్మాలన్ని తొలిచిన పెట్టిన శిల్పి జియాన్ని సియాన్ ఫ్రాకా .ఇంగ్లీషులోను అతని మాతృభాష ఇటాలియన్ లోను ..ఈ కళాకృతికి పెట్టిన పేరు.. రాసిన రెండు పంక్తులు.

అమోర్ డి పేట్రియ
దేశమును ప్రేమిస్తున్నా!
*
ప్రపంచవ్యాప్త మానవులందరి శాంతిమయ భవిష్యత్తును ఆకాంక్షించే విశ్వాసానికి ఇది ఒక ప్రతీక.

రద్దీ బతుకుబాటల్లో పడి, ఊపిరితీసుకోలేనంత తీరికలేకుండా,నిత్యం ఎటు వైపు ఎందుకు పరుగెత్తుతున్నామో ఆగి, ఒక్క క్షణం మనలోకి మనం చూసేకొనేట్టు చేసిందీ ఇనుప బొమ్మ!
వందనాలు శిల్పకారుడికి. న్యూయార్క్ నగరానికి.

వ్యాఖ్యానించండి