మనసెరిగిన మీకు , మనసారా !

11698903_851123241604310_7560822301229155061_o

ఈ మధ్య తరుచు ఒక ఆలోచన వస్తోంది.
కొంత గట్టిగానే.
మరికొంత కుతుహలంతో.

షేక్ స్పియర్ గారి హామ్లెట్ , శరత్ గారి దేవదాసు, ఆస్కార్ వైల్డ్ గారి డోరియన్ గ్రే , గోపీ చంద్ గారి సీతారామా రావు,

తటస్థ పడితే, మన అన్న గారు,  డా.జంపాల చౌదరి గారు ,ఏం చేస్తారా అని!

మాయలు చేయరు. మంత్రాలు వేయరు.
మరి ఏం చేస్తారబ్బా?
మాటలు చెపుతారా? మాత్రలు వేస్తారా?
సరదాగా అంటూన్నానని కాదు.

వారి మాటలు నమ్మి , ఎంత మంది హామ్లెట్లు సంశయాత్మక ధోరణికి స్వస్తి చెప్పారో. ఎందరు దేవదాసులు కుదటపడ్డారో, మరెందరు డోరియన్ గ్రే లు , సీతారామారావులు, ఆ మాటకొస్తే ,జాకల్ మరియు హైడ్లు ,సలక్షణం గా
సానుకూలదృక్పథంతో,  గౌరవ జీవితం గడుపగలుగుతున్నారో!

సహజంగా వినయ సంపన్నులు కనుక ,
వృత్తిధర్మంబది అనుకోవచ్చు.అన బోవచ్చు.

మనతో ముడి పడిన వారి మనసెరిగి మెలగడమే, మాటలతో పని కాదు. ఒక జీవితం సరిపోదు.
అందులోనూ, భిన్న నేపథ్యాలకు, సంస్కృతులకు చెందిన అమెరికనుల ,ఏ మనసులో ఏమి దాగుందో.

ప్రపంచమంతా అమెరికా గుప్పిట్లో ఉందో లేదో కానీ, ప్రపంచమంతా అమెరికాలోనే ఉంది.

అంతటి వైవిధ్య భరితమైన మానవ సమాజంలో , ఒక్కో మనసుది ఒక్కో దారి.

ఒక్కో మూలం. ఒక్కో తీరు. ఒక్కో బాధ. ఒక్కో వేదన.ఒక్కో రుగ్మత.

మరి దేశం కాని దేశంలో , ఒక్కో మనసుకు ఊరట కలిగిస్తూ, చికిత్స చేస్తూ,

ఆ విరిగిన మనసుల్లో ,చెదిరిన గుండెల్లో , మంచినీ , జీవితం పట్ల నమ్మకాన్ని, ప్రేమను నింపడం సామాన్యమైన పని కాదు.
ఆ పనిని మనసుపెట్టి చేశారు కనుకే ,ఈ వేళ, అమెరికా మానసిక వైద్యులు సంతోషంగా సత్కరించుకో బోతున్నారు .

ఇక, అనేకానేక మనోవైకల్యాల నడుమ జీవిస్తూ, ‘కుసింత’ మనస్థిమితం కరువయ్యే, మానసిక చికిత్స వ్యవహారం లో,

చెలమలా ,చెలిమిలా వారి మనసెరిగి మెసులుకొనే, వారి ఇల్లాలు ,” driving force” ,వదినమ్మ , అరుణా జంపాల గారికి శుభాకాంక్షలు.
ఈ సంతోషం మా అందరిదీ !మరెన్నో కలికితురాయిలు మీ ఇంట చేరాలి ! 

మే 16 న, అమెరికా సైకియట్రిక్ అసోసియేషన్ వారి నుండి ” Distinguished Life Fellow” గౌరవం అందుకోబోతున్న సందర్భం గా ,

జేజేలు !
మనసెరిగిన మీకు , మనసారా !

IMG_20160506_080448

3 thoughts on “మనసెరిగిన మీకు , మనసారా !

వ్యాఖ్యానించండి